వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మద్యం మత్తులో ఓ యువకుడు అతివేగంగా కారు నడుపుతూ ద్విచక్ర వాహనాలు, పాదచారులను ఢీకొట్టాడు. గడియారం స్తంభం సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
