Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి మత్తులో కారు హల్‌చల్.. ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 20, 2026 7:47 AM జాతీయంGeneral
గంజాయి మత్తులో కారు హల్‌చల్.. ఇద్దరు అరెస్ట్ - Udayam
సేలం-చెన్నై జాతీయ రహదారిపై ఎరుమపాళ్యం వద్ద గంజాయి మత్తులో ఉన్న యువకులు ఇన్నోవా కారుతో బీభత్సం సృష్టించారు. ప్రమాదంలో టైరు దెబ్బతిని రిమ్ రోడ్డుకు రాసుకుంటూ నిప్పులు చెరుగుతున్నా కారును ఆపకుండా ఐదు చోట్ల ప్రమాదాలకు కారణమయ్యారు. బైకర్లు, స్థానికులు కలిసి కారును చుట్టుముట్టి ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, మరో ఇద్దరు పరారయ్యారు. అరెస్ట్ అయిన వారిని దీపక్ గురు, తిరుమురుగన్‌లుగా గుర్తించగా, నిప్పులు చెరుగుతూ వెళ్తున్న కారు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...