Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సరఫరాకు గండి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 27, 2026 2:08 PM ఏలూరుGeneral
తాగునీటి సరఫరాకు గండి - Udayam
ఏలూరు నగరంలో కొందరు హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రైవేట్ ఆస్పత్రులు, వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు అక్రమంగా తాగునీటిని వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధిక సామర్థ్యమున్న మోటార్లతో నీటిని లాగేయడంతో పలు ప్రాంతాలకు సరఫరా తగ్గుతోంది. అనధికారిక కనెక్షన్లపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. గృహావసరాల కనెక్షన్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...