Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమల దండయాత్రతో గ్రామస్తుల విలవిల

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 11:55 AM కామరెడ్డిGeneral
దోమల దండయాత్రతో గ్రామస్తుల విలవిల - Udayam
నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లి గ్రామాన్ని దోమలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా దోమల బెడదతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాయంత్రం అయితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. దోమల కారణంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల నివారణకు ఫాగింగ్తో పాటు మురుగు కాలువల శుభ్రత, నిల్వ నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...