Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్‌ సొమ్ముతో ఆలయానికి విరాళం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:00 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
 పెన్షన్‌ సొమ్ముతో ఆలయానికి విరాళం - Udayam
అగలి మండలం పి.బ్యాడిగెర గ్రామానికి చెందిన కరేగౌడ్‌ తనకు నెలనెలా వచ్చే పెన్షన్‌ సొమ్మును ఆదా చేసి శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి రూ.6,385 విరాళంగా అందజేశారు. గ్రామస్థుల సమక్షంలో ఆదివారం రాత్రి ఈ మొత్తాన్ని ఆలయ కమిటీకి అందించారు. తన కూతురు, కొడుకులు, మనవళ్లు కలిసి మరో రూ.10 వేలు అందజేస్తారని కరేగౌడ్‌ తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన కుటుంబాన్ని కమిటీ సభ్యులు అభినందించారు.

Comments

G
Loading comments...