Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 30, 2026 4:21 PM పెద్దపల్లి General
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. వాగులు, వంకలు, కల్వర్టులు, డ్యామ్‌లు, జలపాతాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...