వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న అంజిత్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల వ్యవసాయ అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంజిత్ కుమార్ 8 సంవత్సరాలుగా దండేపల్లి మండల వ్యవసాయ అధికారిగా అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించారు.
కాగా దండేపల్లి మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారిగా లక్షెట్టిపేట ఏవో శ్రీకాంత్ ను ఉన్నతాధికారులు నియమించారు.
Comments
Loading comments...

