వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలోని మాడల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో బోనాలను తయారు చేశారు. నెత్తిన బోనం ఎత్తుకొని పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.
చిన్నారులు వేసిన పోతురాజు వేషాలు, విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. బోనాల పండుగ ఆవశ్యకతను ప్రిన్సిపల్ శ్రీలత విద్యార్థులకు తెలియజేశారు.
Comments
Loading comments...

