Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దీవాన’ ట్రైలర్ విడుదల

Follow Udayam on Google
Sonia Jun 11, 2026 3:09 PM జాతీయంవినోదం
‘దీవాన’ ట్రైలర్ విడుదల - Udayam
​గీతా ఆర్ట్స్ సమర్పణలో, వి స్టూడియోస్ మరియు అర్హా మీడియా భాగస్వామ్యంలో రూపుదిద్దుకుంటున్న సరికొత్త రొమాంటిక్ చిత్రం ‘దీవాన’. హర్షిత్ రెడ్డి, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగీశెట్టి దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ​తెలంగాణ యాసలో సాగే మాస్ సంభాషణలు, ఒన్‌సైడ్ లవ్ ఎమోషన్స్ ఈ ట్రైలర్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Comments

G
Loading comments...