Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

Follow Udayam on Google
Harika Jun 22, 2026 2:40 PM జగిత్యాలGeneral
రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి - Udayam
పంటలకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల కోసం నిరసన తెలిపిన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. కేసులు ఎదుర్కొంటున్న రైతులు సోమవారం మెట్‌పల్లి కోర్టుకు హాజరయ్యారు. శాంతియుత నిరసనకారులపై కక్షపూరిత కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం స్పందించి, వెంటనే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...