Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.46 కోట్ల మోసం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 10:28 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.46 కోట్ల మోసం - Udayam
'డిజిటల్ అరెస్టు' పేరుతో 76 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి దంపతులను భయపెట్టి రూ.1,46,50,520 కాజేసిన కేసులో కేరళకు చెందిన షబ్బీర్‌ (40)ను విశాఖ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ, సీబీఐ అధికారులమంటూ బెదిరించి ఆర్బీఐ ఫండ్‌ వెరిఫికేషన్‌ పేరుతో నగదు బదిలీ చేయించారు. షబ్బీర్‌ ఖాతా ద్వారా రూ.92 లక్షలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది.

Comments

G
Loading comments...