Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధ్వంసమైన చెక్‌డ్యామ్‌ పునర్నిర్మించాలని రైతుల డిమాండ్‌

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:15 PM పెద్దపల్లి General
ధ్వంసమైన చెక్‌డ్యామ్‌ పునర్నిర్మించాలని రైతుల డిమాండ్‌ - Udayam
ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద ధ్వంసమైన చెక్‌డ్యామ్‌ను ఇప్పటికీ పునర్నిర్మించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్న సమయంలో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది గుర్తుతెలియని వ్యక్తులు చెక్‌డ్యామ్‌ను కూల్చివేశారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...