వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి గ్రామ శివారులోని చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. పేకాట జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో ఎస్సై జి. సందీప్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి దాడి నిర్వహించారు.
ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.8,310 నగదు, 5 సెల్‌ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

