Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి వారం రోజుల జైలు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 02, 2026 4:02 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి వారం రోజుల జైలు - Udayam
ధర్పల్లి మండలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ వాహన తనిఖీల్లో పట్టుబడిన చింత సాయికుమార్, గంగాధర్‌లపై ధర్పల్లి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని గౌరవ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూర్జహాన్‌ ఎదుట హాజరుపరచగా, ఇద్దరికీ వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ జి. సందీప్‌ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ అన్నారు.

Comments

G
Loading comments...