Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధమ్మన్‌పేట్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – 7 మంది అరెస్ట్

Follow Udayam on Google
మధుప్రియ Aug 23, 2026 8:09 PM నిజామాబాద్General
ధమ్మన్‌పేట్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – 7 మంది అరెస్ట్ - Udayam
ధర్పల్లి ధమ్మన్‌పేట్ గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్‌ఐ సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,010 నగదు, ఐదు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.

Comments

G
Loading comments...