వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మాసం సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలోని మహాలక్ష్మి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మహిళలు కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించడంతో కుటుంబాలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని భక్తులు ప్రార్థించారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
Comments
Loading comments...

