Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానల బీభత్సం: ఆలూరులో స్తంభించిన రవాణా

Follow Udayam on Google
Sukesh Jun 14, 2026 1:05 PM కర్నూలుGeneral
వానల బీభత్సం: ఆలూరులో స్తంభించిన రవాణా - Udayam
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కుండపోత వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా అస్తవ్యస్తం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి స్థానిక వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిని దాటి ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. హాలహర్వి, హత్తిబెళగల్ వద్ద నడిమివంక, కళ్లెవంకలు ఉప్పొంగడంతో కర్నూలు–బళ్లారి, గుంతకల్లు–ఆలూరు ప్రధాన రహదారులపై రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...