వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అర్హులైన సుమారు 55 వేల మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ చేయనున్నారు.
ఈ పథకాన్ని రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి చేనేత అనుబంధ రంగాలకూ వర్తింపజేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

