Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ తీరంలో బోటు ప్రమాదం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 16, 2026 11:13 AM విశాఖపట్నంGeneral
విశాఖ తీరంలో బోటు ప్రమాదం - Udayam
విశాఖపట్నం తీరంలో గురువారం ఉదయం ఒక వేట బోటు అదుపుతప్పి, బ్రేక్ వాటర్ వద్ద ఉన్న టెట్రాపాడ్లను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. రాళ్ల మధ్య బోటు చిక్కుకుపోవడంతో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్, తోటి మత్స్యకారులు సముద్రంలో మునిగిపోతున్న ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...