వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలు ప్రారంభమై నెలన్నర గడిచినా మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ పూర్తికాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విద్యా కిట్ల పంపిణీ ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.
రెండు జతల యూనిఫాంలతో పాటు పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని త్వరగా అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

