వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత యూనిఫాం పంపిణీ పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 950 పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటివరకు సుమారు 21 వేల మందికే యూనిఫాం అందింది.
మిగతా విద్యార్థులు సాధారణ దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. కోదాడ, హుజూర్నగర్, గరిడేపల్లి తదితర మండలాల్లో ఇంకా యూనిఫాం అందలేదు. విద్యార్థులు పంపిణీ త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

