వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
సింగరేణి లాభాల ప్రకటనపై జాప్యం

2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలవుతున్నా సింగరేణి యాజమాన్యం లాభాలను ప్రకటించకపోవడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నిర్దేశిత 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో ఈసారి కేవలం 58 మిలియన్ టన్నులే సాధించారు.
లక్ష్యం నెరవేరకపోవడంతో ఈ ఏడాది లాభాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్షణమే ఆడిట్ పూర్తి చేసి లాభాల వాటాను విడుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Loading comments...