వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి లో ఈ నెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు వీడీసీ, శివ భక్త కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుంచి కార్యక్రమాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, ఊయల సేవ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. మందిరం ఆవరణలో ఉట్టి కొట్టుట, అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

