Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 ఏళ్ల తర్వాత తీర్చిన అప్పు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:05 AM జాతీయంGeneral
25 ఏళ్ల తర్వాత తీర్చిన అప్పు - Udayam
కేరళకు చెందిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ 25 ఏళ్ల క్రితం సౌదీలో స్నేహితుడు లచ్చన్న నుంచి తీసుకున్న రూ.25 వేల అప్పును తీర్చేందుకు తెలంగాణలోని ధర్మపురికి వచ్చారు. లచ్చన్న చిరునామా తెలియకపోయినా గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో ధర్మపురి చేరుకుని కుటుంబాన్ని గుర్తించారు. ప్రస్తుతం గల్ఫ్‌లో ఉన్న లచ్చన్నతో ఫోన్‌లో మాట్లాడి, అప్పు మొత్తాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.

Comments

G
Loading comments...