వార్తలకు తిరిగి వెళ్లండి

ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి రెండు పాడి ఆవులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. రైతు ఆర్ల అనురాధ పాడి ఆవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
మృతి చెందిన ఆవుల విలువ రూ.2 లక్షలకుపైగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తూ, బాధిత రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

