వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రజలను ఎస్ఐ జ్ఞానప్రసాద్ కోరారు. రామభద్రపురం మండల కేంద్రంలోని కనిమెరకలవీధిలో బుధవారం సమావేశం నిర్వహించి డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వలన ఆరోగ్యం చెడిపోయి కుటుంబాలు నాశనమవుతాయన్నారు.
పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. మహిళలను వేదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

