Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైన్లు శుభ్రం చేసి నీరు సాఫీగా వెళ్లేలా చూడాలి: కాకినాడ ఆర్డీవో

Follow Udayam on Google
Sathish Sep 24, 2026 5:40 PM కాకినాడGeneral
డ్రైన్లు శుభ్రం చేసి నీరు సాఫీగా వెళ్లేలా చూడాలి: కాకినాడ ఆర్డీవో  - Udayam
తీవ్ర వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ ఆర్డీవో మల్లిబాబు సూచించారు. గురువారం యు.కొత్తపల్లి మండలంలో పర్యటించి వర్షపు నీటి నిల్వలను పరిశీలించారు. కాలనీల్లో నీరు నిలవకుండా ఇరిగేషన్ డ్రైన్లు, మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. కాలువల్లో గుర్రపు డెక్క తొలగించి నీరు సాఫీగా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...