వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు రేగులపాడు ఆఫ్సూర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వీధులన్నీ జలమయమయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. శుక్రవారం సీపీఐ నాయకులు కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
డ్రైనేజీ, రోడ్లు లేకపోవడంతో వర్షపు, మురుగునీరు వీధుల్లో నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు . జిల్లా అధికారులు స్పందించి డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

