వార్తలకు తిరిగి వెళ్లండి
రామభద్రపురం మండల కేంద్రంలోని రోడ్డు డంపింగ్ యార్డును తలపిస్తుంది. టీబీఆర్ థియేటర్ దాటిన తర్వాత బొబ్బిలి వైపు రోడ్డు పక్కన చెత్త వేస్తున్నారు. రోడ్డు పక్కన చెత్త వేయడం వలన వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గాలి వీస్తే చెత్త ఎగిరి కళ్లలోకి వస్తుందని, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

