వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాలి(M) శ్రీపురం-కన్నెవలస మధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కవిటి నుండి విశాఖపట్నం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బోరువంక గ్రామానికి చెందిన బాలక కుర్మనాయకులు (65) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

