Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి: ధర్మాన

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 2:23 PM శ్రీకాకుళంGeneral
డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి: ధర్మాన - Udayam
డీఎస్సీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పొన్నాడ బ్రిడ్జి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బుధవారం ఆయన సంఘీభావం తెలిపారు. డీఎస్సీని రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను అణచివేయడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...