వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జాతీయ జెండా కిందపడిన ఘటన కలకలం రేపింది. జెండాను ఎగురవేసే క్రమంలో ఒక్కసారిగా దారం తెగిపోవడంతో జెండా కిందపడినట్లు సమాచారం.
ప్రధానోపాధ్యాయులు శ్రీహరి రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

