వార్తలకు తిరిగి వెళ్లండి

ముంచంగిపుట్టు-కరిముఖిపుట్టు మార్గంలో డేగలపుట్టు సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. వర్షపు నీరు చేరడంతో గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు గుంతల్లో ఇరుక్కుపోయి చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
వంతెన సమీపంలోని గుంతతో ప్రమాదం పొంచి ఉందని, వందకు పైగా గ్రామాలకు ఉపయోగపడే ఈ రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

