Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ తవ్వకాలతో చెరువుకు ముప్పు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 04, 2026 3:37 PM ప్రకాశం General
అక్రమ తవ్వకాలతో చెరువుకు ముప్పు - Udayam
కంభం చెరువు అలుగు మార్గంలోని నీటి తొట్టి కొండపై అక్రమ గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇదే రీతిన తవ్వకాలు సాగితే చారిత్రక చెరువు ఉనికికి ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీ గుంతలు ఏర్పడ్డాయని, కొండ అంచులను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రాంతాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ రవిప్రసాద్ తెలిపారు.

Comments

G
Loading comments...