Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానీ మాస్టర్‌ భార్య పై డ్యాన్సర్లు తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 12, 2026 7:28 PM హైదరాబాద్General
జానీ మాస్టర్‌ భార్య పై డ్యాన్సర్లు తీవ్ర ఆగ్రహం - Udayam
తెలుగు ఫిల్మ్‌ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. అసోసియేషన్‌ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ భార్య సుమలత వ్యవహారశైలిపై డ్యాన్సర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని ఆరోపిస్తూ అసోసియేషన్‌కు చెందిన 10 మంది డ్యాన్సర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. సినీ ఫెడరేషన్‌ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే సుమలత బై ఎలక్షన్‌ నిర్వహించేందుకు సిద్ధపడటమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామం ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...