వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని దాములూరు కూడలి వద్ద నిర్మించిన వంతెనను ప్రభుత్వ విప్ సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ రాజగోపాల్ పరిశీలించారు. వంతెనకు రెండు వైపులా అప్రోచ్ రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 7.50 కోట్లు మంజూరు చేసిందని వారు తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ రహదారి అభివృద్ధి నిలిచిపోయిందని వారు విమర్శించారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

