Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిల భవనాల్లో పశువైద్యం.. అవస్థల్లో పాడి రైతులు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 30, 2026 8:49 AM అల్లూరి General
శిథిల భవనాల్లో పశువైద్యం.. అవస్థల్లో పాడి రైతులు - Udayam
జిల్లాలో పశువైద్యశాలల భవనాలు శిథిలావస్థకు చేరడంతో పశుపోషకులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వర్షపు నీరు లోనికి చేరి మందులు తడుస్తుండగా, కొన్ని భవనాలు వినియోగానికి వీలులేని స్థితిలో ఉన్నాయి. కొన్ని వ్యాధులకు అవసరమైన మందులు, ఇంజక్షన్ల కొరత ఉందని పశుపోషకులు చెబుతున్నారు. శిథిల భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...