వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు బీబీనగర్ రైల్వే డబ్లింగ్ పనులకు దాచేపల్లి మండలంలో భూ సేకరణ పూర్తయిందని దాచేపల్లి
తహశీల్దార్ జి.శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భూసేకరణ అంశంపై శనివారం రైల్వే అధికారులతో తహశీల్దార్ సమీక్షించారు.
మండల పరిధిలో నడికుడి 81 సెంట్లు, రామాపురం 48 సెంట్లు, కేసానుపల్లి 1.52 సెంట్లు, పొందుగుల లో 4.20 సెంట్లు సేకరించామన్నారు. త్వరలో ఈ భూమిని రైల్వే శాఖకు అప్పగించనున్నట్లు తహశీల్దార్ వెల్లడించారు
Comments
Loading comments...

