Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురవరం సేవలను స్మరించిన సీపీఐ నేతలు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:18 PM కరీంనగర్General
సురవరం సేవలను స్మరించిన సీపీఐ నేతలు - Udayam
కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మరణ కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి కమ్యూనిస్టు ఉద్యమానికి చేసిన సేవలను నాయకులు స్మరించారు. ఆయన సేవలను కొనియాడుతూ వారు నివాళులర్పించారు.

Comments

G
Loading comments...