వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైనా విశాఖ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
దేశంలోని ఇతర నగరాల్లో రెండు విమానాశ్రయాలు పనిచేస్తున్నాయని పేర్కొంటూ, ప్రజల ప్రయాణ సౌకర్యాలు, నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పాత విమానాశ్రయాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

