Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంపతుల గొడవలో జోక్యం.. యువకుడి దారుణ హత్య!

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jun 28, 2026 11:56 AM జాతీయంక్రైమ్
దంపతుల గొడవలో జోక్యం.. యువకుడి దారుణ హత్య! - Udayam
భార్యాభర్తల గొడవను ఆపడానికి ప్రయత్నించిన హేమంత్‌ నాయక్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లా మాయబాహల గ్రామంలో ఈ ఘటన జరిగింది. కందర్పదెహురి అనే వ్యక్తి తన భార్యపై దాడికి దిగగా, ఆమె ప్రాణభయంతో పొరుగున ఉన్న హేమంత్ ఇంట్లో దాక్కుంది. నిందితుడిని హేమంత్ అడ్డుకోవడంతో, ఆగ్రహానికి గురైన కందర్ప పదునైన ఆయుధంతో హేమంత్‌పై దాడి చేసి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...