వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి చేసుకోవాలంటూ కారులో ప్రియురాలిని పెట్రోల్ బాంబుతో బెదిరించిన నాగేంద్ర(30) అనే యువకుడు, ఆ బాంబు పేలి కారుతో సహా సజీవదహనమయ్యాడు. కర్ణాటకలోని శిరా సమీపంలో ఈ ఘటన జరిగింది.
నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేయగా, యువతి చాకచక్యంగా కారులోంచి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకుంది. ఆ వెంటనే కారులో బాంబు పేలడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

