Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీకి గురైన సౌర విద్యుత్ సామగ్రి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 11:54 AM వికారాబాద్General
చోరీకి గురైన సౌర విద్యుత్ సామగ్రి - Udayam
సౌర విద్యుత్ సామగ్రి చోరీకి గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని బెల్కటూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎక్మాయి శంకర్ అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడేందుకు పొలం చుట్టూ సౌర విద్యుత్‌ను అమర్చాడు. తన ఎకరాతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని కంది, పత్తి, పెసర సాగు చేస్తున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని చోరీ చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Comments

G
Loading comments...