Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలకూరు చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలపై ఆందోళన

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 12:25 PM కడపGeneral
కమలకూరు చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలపై ఆందోళన - Udayam
అట్లూరు మండలం కమలకూరు పెద్ద, చిన్న చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా మట్టిని తరలించడం వల్ల చెరువుల్లో గోతులు ఏర్పడి ఆయకట్టుకు నీరందే మార్గం దెబ్బతింటోందని చెబుతున్నారు. ఈ చెరువుల కింద 550 ఎకరాల ఆయకట్టు ఉంది. అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ తెలిపారు.

Comments

G
Loading comments...