Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవంచ పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 11, 2026 3:31 PM నాగర్ కర్నూల్General
అవంచ పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
తిమ్మాజిపేట మండలం అవంచలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతను పరిశీలించారు. ANC పరీక్షలకు వచ్చిన గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు, సలహాలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...