వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాడేపల్లిలో తెదేపా, జనసేన, భాజపాల రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. కూటమి పార్టీల మధ్య సమాచార లోపాన్ని సరిదిద్ది, ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు.
ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు, పిడుగు హరిప్రసాద్, పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. కీలక పరిణామాలపై సమన్వయంతో ముందడుగు వేయాలని నేతలు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

