Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుతో తుమ్మల భేటీ

Follow Udayam on Google
K.Venkatesh Aug 21, 2026 9:27 AM ఖమ్మంGeneral
చంద్రబాబుతో తుమ్మల భేటీ - Udayam
అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు రూ.92.20 కోట్లు అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏపీలో 85.25 శాతం ఆయకట్టు ఉన్నందున పునరుద్ధరణ వ్యయాన్ని నిష్పత్తి ప్రాతిపదికన పంచుకుని అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే విజ్ఞప్తి చేసినా నిర్ణయం పెండింగ్లో ఉందన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...