వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద ఉన్న ప్రభుత్వ చేతిపంపును గుర్తుతెలియని వ్యక్తులు మట్టి, ఇటుకలతో పూడ్చివేశారు.
సరిపడా నీళ్లు లేక నిత్యం ఈ చేతిపంపుపైనే ఆధారపడుతున్నామని, కావాలనే నిరుపయోగం చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తాగునీటి సమస్య తీర్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

