వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాల సందర్భంగా గరివిడి మండల వ్యాప్తంగా కూడళ్ల వద్ద చందా వసూలు చేయరాదని ఎస్ఐ లోకేశ్వరరావు హెచ్చరించారు. వాహనదారులను ఇబ్బందికి గురిచేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. గ్రామాల్లో ఉత్సవాల పేరుతో అల్లర్లు జరిగితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పోలీసులకు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

