Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సీఎం రేవంత్ ఉమ్మడి పాలమూరు పర్యటన

Ravi Singh Jun 04, 2026 4:59 AM హైదరాబాద్ 6 viewsabout 3 hours ago
సీఎం రేవంత్ ఉమ్మడి పాలమూరు పర్యటన - Udayam Digital
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేటి నుండి రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులతో పాటు గూడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను ఆయన పరిశీలిస్తారు. అలాగే, కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజీలను ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షించి, రాత్రి సోమశిలలో బస చేస్తారు. రెండో రోజు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి పంప్‌హౌజ్‌, కరివెన రిజర్వాయర్లను సీఎం సందర్శిస్తారు. అనంతరం ఉద్దండాపూర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Comments

G
Loading comments...